15 July, 2026 | 6:03 AM

రాజ్యసభ సభా నాయకుడిగా నడ్డా?

22-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 21 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరో కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నడ్డాను రాజ్యసభ సభా నాయకుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. అయితే, ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉంది. జేపీ నడ్డా న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.  బీజేపీ సైద్ధాంతిక సంస్థ అయిన ఆరెస్సెలో పనిచేశారు. అనేక కీలకమైన పదవుల్ని చేపట్టారు. తాజాగా మోదీ కేబినెట్‌లోమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.