15 July, 2026 | 5:56 AM

కొత్త న్యాయ చట్టాలు అమలుచేయొద్దు

22-06-2024 12:05 AM

కోల్‌కతా, జూన్ 21: కేంద్రప్రభుత్వం రూపొందించిన కొత్త న్యా య చట్టాల అమలును నిలిపివేయాలని ప్రధాని నేరేంద్రమోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఐపీసీ, సీపీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ సురక్ష సంహితను రూపొందించిన విష యం తెలిసిందే. ఈ చట్టాలను జూలై 1వ తేదీ నుంచి అమలుచేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ చట్టాల్లో అనేక లోపాలున్నాయని చట్టాలపై పార్లమెంటులో మళ్లీ చర్చించాలని ప్రధానికి మమత విజ్ఞప్తి చేశారు.