calender_icon.png 12 October, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండ డీసీసీ అధ్యక్షుడి పదవికి అవకాశం ఇవ్వాలి

12-10-2025 07:44:18 PM

మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ..

నకిరేకల్ (విజయక్రాంతి): గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తు, కార్యకర్తలకు అండదండగా ఉంటున్నాని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి పదవికి అర్హుడుని కాబట్టి అవకాశం ఇవ్వాలిని కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ పిసిసి డెలికేట్ మెంబెర్ సుంకరబోయిన నరసింహ యాదవ్ కోరారు. ఆదివారం సాయి కృష్ణ రెసిడెన్సిలో డీసీసీ ఎంపిక ప్రక్రియలో రెండవ రోజు భాగంగా ఏఐసీసీ మాజీ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతి, అబ్జర్వర్లు సుబ్రహ్మణ్యం, ఇంద్రకరణ్ రెడ్డిలను ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుంకర బోయిన నరసింహ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ హోదాల్లో పని చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. 

రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చిన నేటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తుందని ఆయన తెలిపారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా ఎంపీటీసీగా కట్టంగూరు మండలం జడ్పీటీసీగా టీపీసీసీ డెలిగేట్ మెంబర్ గా పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో కృషి చేశాని ఆయన తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడి పదవికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను ఆయన కోరారు. మరింత పార్టీ అభివృద్ధి కోసం గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.