calender_icon.png 12 October, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గ విభేదాలు వీడుదాం...!

12-10-2025 07:41:25 PM

కలిసికట్టుగా ఎన్నికల్లో పని చేద్దాం..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం..

పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరుల తీర్మానం..

వర్ని, రుద్రూర్ మండలాల కాంగ్రెస్ నాయకుల సమావేశం.. 

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఒక్కటైన కాంగ్రెస్ నాయకులు..

సమావేశంలో తీర్మానించుకున్న నాయకులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేటట్లు ఉండే వర్గ పోరుకు కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పుల్ స్టాప్ పెట్టారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, రుద్రూర్ మండలాల కాంగ్రెస్ నాయకులు గ్రూపులకు స్వస్తి పలుకుదామని గ్రామ పెద్దల సమక్షంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఏర్కూరు మొగలయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కులకర్ని సురేష్ బాబా మాట్లాడుతూ ఇక వర్గ పోరుకు స్వస్తి పలుకుదాం, అందరం కలిసి కట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని సమావేశంలో తీర్మానించారు.

వర్గ పోరును పక్కన పెడదాం, కల్సికట్టుగా పనిచేసే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేద్దామని అన్నారు. ఈ సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి కోసం అందరూ పాటుపడాలని సమావేశంలో తీర్మానించారు. వర్గాల పోరుకు స్వస్తి పలుకుదాం స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని సమావేశంలో చర్చించుకున్నారు. విభేదాలు వర్గ పోరును పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకుందామని విభేదాలు విడనాడదామని సమావేశంలో చర్చించారు. ఇక వర్ని, రుద్రూర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరుకు ఇక స్వస్తి పలికినట్లేనా అని చర్చించుకుంటున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఒకటి కావడం నియోజకవర్గంలో చర్చని అంశంగా మారింది.

వర్గ పోరు ఉండడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలు అయ్యే అవకాశాలు ఉంటాయని భావించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వర్గ పోరును పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేద్దామని సమావేశంలో తీర్మానం చేయడంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకటయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డిలు చెప్పిన ఆదేశాల మేరకే ఒకటయ్యారా లేక స్థానికంగా ఉన్న నాయకులు ఒకటయ్యారా అనేది భవిష్యత్తు లో జరిగే ఎన్నికల్లో వారు అవలంబించే తీరే తేట తెల్లం కానుంది. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, రుద్రూర్ మండలాలే కాకుండా మిగతా బీర్కూరు, నసురుల్లాబాద్, పోతంగల్, కోటగిరి, మండలాల కాంగ్రెస్ నేతలు ఒకటైతారా లేద వేచి చూడాల్సిందే మరి.