19 June, 2026 | 7:12 PM

వాసవి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు సన్మానం

19-06-2026 06:11 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాసవి క్లబ్ ల వారి ఆధ్వర్యంలో శుక్రవారం  ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (బాలికలు) పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరంవాసవి క్వీన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో (బాలురు) పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాతో సన్మానించడం జరిగింది.