19 June, 2026 | 7:37 PM

దేవర వినోద్ ను ఆహ్వానించిన గ్రామ ప్రజలు

19-06-2026 06:39 PM

బెజ్జూర్,(విజయక్రాంతి):  బెజ్జూర్ మండలంలోని నాగుల్వాయి గ్రామ ప్రజలు దేవర వినోద్ స్వామిని సాల్వతో సత్కరించారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ శ్రీ కనకదుర్గ మహంకాళి ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామిని గ్రామ ప్రజలు సాల్వతో సత్కరించి జూలై 5న నిర్వహించే పోచమ్మ బోనాల ఊరేగింపు, పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు. గత సంవత్సరంలో కూడా గ్రామ ప్రజలందరూ ఏకమై గ్రామంలో పోచమ్మ బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడంతో గ్రామంలో పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారని ఆ నమ్మకంతో ఈ సంవత్సరం కూడా బోనాల వేడుకలు ఏర్పాటు చేసేందుకు గ్రామ ప్రజలందరూ ఏకమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.