21 April, 2026 | 4:08 AM

విజయ్ దేవరకొండ సినిమాకు క్లాప్‌కొట్టిన నాని

21-04-2026 02:48 AM

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ కాంబోలో ఓ గ్లోబల్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ హీరో నాని క్లాప్ కొట్టారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. అలెజాండ్రో మార్టినెజ్ డీవోపీగా, సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.