22 June, 2026 | 1:34 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలా అండగా ఉంటాం

21-04-2026 10:03 AM

 TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో “పార్వతి సినిమాస్” బ్యానర్‌పై రూపొందుతున్న “రెటీనా” (Eyes Never Lie) సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త(TPCC General Secretary Uppala Srinivas Gupta), ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు యాట సత్యనారాయణ విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ, తెలంగాణలో సినిమా రంగానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాలు నిలవాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా యువతకు మంచి సందేశం ఇచ్చే చిత్రాలు తీసుకురావాలని సూచించారు.

డ్రగ్స్ వంటి చెడు అలవాట్లను ప్రోత్సహించకుండా, సమాజానికి ఉపయోగపడే, ప్రేరణనిచ్చే కథలతో సినిమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ముగింపులో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆశీర్వాదాలతో “రెటీనా” చిత్రం విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత కమిటీ కుర్రాళ్ళు హీరో యశ్వంత్, ప్రొడ్యూసర్  శ్రీమతి పార్వతి, డైరెక్టర్  శ్రీ అల్లం రాజుగారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  శ్రీ రవికుమార్ గారు, రెటిన హీరో మనీష్ గారు, హీరోయిన్స్ సోనియా నాయుడు గారు, ప్రీతి hepsona గారు, సీనియర్ నటులు లక్ష్మి పార్వతి గారు, పుష్పా చౌదరి గారు, యోగి ఖత్రి, చిత్ర బృందం పాల్గొన్నారు.