27 August, 2026 | 6:57 PM

మోడల్ స్కూల్లో వృక్షా బంధన్

27-08-2026 05:45 PM

చెట్టుకు రక్షణగా ఉంటామంటూ రాఖీలు కట్టిన విద్యార్థులు

బోథ్ ఆగస్టు 27 ( విజయక్రాంతి.): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలకు నీళ్లు పోసి రాఖీలు కట్టారు. మొక్కకు నేను రక్ష నాకు మొక్క రక్ష అంటూ రాఖీలు కట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర గురించి ప్రిన్సిపల్ అనురాధ విద్యార్థులకు వివరించారు. కాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టి సహోదర భావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వృక్షశాస్త్రం ఉపాధ్యాయుడు పర్యావరణ ప్రేమికుడైన  ఎస్. ప్రవీణ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.