కాలినడకన తిరుమల కొండకు నాని
24-08-2024 11:24 AM
తిరుమల: నటుడు నాని కాలి నడకన తిరుమల చేరుకున్నారు. తన సతీమణి అంజన, తనయుడు అర్జున్తో పాటు నటి ప్రియాంక అరుళ్ మోహన్ తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు. మార్గమధ్యంలో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. నాని నటించిన నూతన చిత్రం సరిపోదా శనివారం. ప్రియాంక కథానాయక. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి ఈ సినిమా నిర్మించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ సినిమాను ఎస్ జే సూర్య కీలకపాత్ర పోషించారు. దాదాపు 2:50 గంటల నిడివితో సిద్ధమైన ఈ చిత్రం ఆగస్టు 29 అని్న భాషల్లో విడుదల కానుంది.






