అక్టోబర్ 6న జాతీయ ప్రతినిధుల సభ

28-09-2026 | 06:08pm

విజయవంతం చేయాలని నాయకుల పిలుపు

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల(Osmania University College of Arts) ప్రాంగణంలో నిర్వహించనున్న మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి మడిపల్లి శ్యాంబాబు మాదిగ, రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు.

భూపాలపల్లి కాంట్రాక్టర్ భవన్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా నుంచి అన్ని మండలాలు, గ్రామాల నుంచి మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. అలాగే అక్టోబర్ 2న మద్యపాన నిషేధం కోసం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో శ్రీనివాస్ మాదిగ, మొగిలయ్య మాదిగ, మడిపల్లి సుమన్ మాదిగ, బొల్లి బాబు మాదిగ, మొలుగూరి రవీందర్ మాదిగ, దోర్నాల రాజేంద్ర మాదిగ, గాజుల బిక్షపతి మాదిగ, అంతడుపుల సురేష్ మాదిగ, మారపాక లక్ష్మయ్య మాదిగ, కేసరపు నరేష్ మాదిగ, నిరపటి అశోక్ మాదిగ, రామ్ రామచంద్ర మాదిగ, నేరెళ్ల ఓదెలు మాదిగ, బెల్లంపల్లి సురేష్ మాదిగ, మామిడి రవి మాదిగ, తుడిచర్ల దుర్గయ్య మాదిగ, కొండమల్ల విష్ణు మాదిగ, ఎర్ర భద్రయ్య మాదిగ, జిల్లెల నాగరాజు మాదిగ, దోర్నాల భరత్ మాదిగ, అంబాల రాజు మాదిగ, సదనం రాజు మాదిగ, బోడికల శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు