నేటి నుంచి జాతీయస్థాయి నాటక పోటీలు
మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని చైతన్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో నేటి నుండి ఐదు రోజులపాటు జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతి ఏటా ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడే జాతీయస్థాయి తెలుగు ఆహ్వానిత నాటిక పోటీలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆదివారం సంస్థ అధ్యక్షులు మన్నూరు ఉమ అధ్యక్షతన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అసోసియేట్ అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుంకరనేని పినాకపాణి, కోశాధికారి గడల శ్రీనివాస్ ,సంస్థ ప్రతినిధులు లేగల వెంకటరెడ్డి, బుదారపు శ్రీనివాస్, మాచర్ల వెంకన్న,ఇమ్మడి రాంబాబు, పెరుమాండ్ల రవి గౌడ్, రామగిరి భాస్కరాచారీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసి తమ ప్రతిభను ప్రదర్శించనున్న కళాకారులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. అలాగే తొర్రూరు పట్టణం, పరిసర ప్రాంతాల కళాభిమానులు, కళాపోషకులు, సాహితీ ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొని నాటిక పోటీలను విజయవంతం చేయాలని వారు కోరారు.




