10 June, 2026 | 6:09 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •   మహిళల రక్షణకు ప్రాధాన్యత   •   అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రాహుల్‌పై కన్నెర్ర

22-02-2026 12:44 AM

ఏఐ సదస్సు ఎదుట కాంగ్రెస్ నేతల అర్ధనగ్న ప్రదర్శనపై భగ్గుమన్న బీజేవైఎం

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

వీధుల్లోకి వచ్చి రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౨౧: న్యూఢిల్లీలోని భారత్ మండప్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏఐ ఇంపాక్ట్ ఇండియా సదస్సు ప్రాం గణంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ విభా గ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ నేతల చేష్టలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) శనివారం దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బీజేవైఎం నేత లు, కార్యకర్తలు శనివారం పెద్ద ఎత్తున ఆం దోళనలు నిర్వహించారు.

పలుచోట్ల ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. న్యూఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్, హిమాచల్‌ప్రదేశ్ రాజధాని షిమ్లా, బీహార్‌లోని పాట్నా, గుజరాత్‌లోని సూరత్, జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూలోనూ బీజేవైఎం నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పలు చోట్ల పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్తతలపై బీజేపీ అగ్రనేతలు ఘాటుగా స్పందించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ నిరసనలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గాంధీభవన్ (కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం) ముట్టడికి బీజేవైఎం నేతలు యత్నించారు. ఆందోళనకారులను హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు.