31 July, 2026 | 5:59 PM

టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో VBGRAMG ఉద్యోగుల శాంతియుత నిరసన

31-07-2026 05:26 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో VBGRAMG ఉద్యోగులు శుక్రవారం శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని, మితిమీరిన పని వత్తిడిని తగ్గించాలి.

ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అదనపు కార్యక్రమ అధికారి శ్రీ కాళంగి శ్రీనివాస్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీ ఎం. తిరుపతి, టీఏలు బీముడు, వెంకట రమణ, సురేష్, చాంద్ మాల్, స్వప్న, ఈశ్వరి, కంప్యూటర్ ఆపరేటర్లు సురేష్, అరుణ తదితరులు పాల్గొన్నారు.