calender_icon.png 29 January, 2026 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఒక మావోయిస్టు మృతి

25-07-2024 05:58:56 PM

అల్లిగూడెం: ములుగు జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అల్లిగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పులో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్ అలియస్ విజేందర్ గా పోలీసులు గుర్తించారు. మావోయిస్టుల కోసం అల్లిగూడెం అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతుంది.