కామన్‌వెల్త్ గేమ్స్‌కు నీరజ్ చోప్రా
32 మందితో అథ్లెటిక్స్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 14: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడ లకు ఎంపికయ్యాడు. దోహా డైమండ్ లీగ్‌కు దూరమైన నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమా ఖ్య ఈ మెగా ఈవెంట్‌కు తీసుకుంది. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న చోప్రాపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై 23 నుంచి మొదలయ్యే కామన్వెల్త్ క్రీడల కోసం 32 మందితో కూడిన అథ్లెటిక్స్ బృందాన్ని ప్రకటించింది.
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా సాధన చేస్తున్న నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సాధించడంపైనే అతను బరిలోకి దిగే అవకాశాలు ఆధారపడి ఉ న్నాయి. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్న నీరజ్‌తో పాటు రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ కూడా కామన్‌వెల్త్ గేమ్స్‌కు జావెలిన్ త్రోలో ఎంపికయ్యారు. ఇటీవలే 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు బద్ధలు కొట్టిన గురిందర్వీర్ సింగ్, 200 మీటర్ల ఈవెంట్‌లో రాణించిన అనిమేశ్ కుజుర్లు కూడా కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగనున్నారు.






