1 April, 2026 | 1:23 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి

01-04-2026 11:44 AM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో దేవి హాస్పిటల్ లో ఆందోళనకు దిగిన భాదితులు. వివరాలు ఇలా ఉన్నాయి. కొకొండ గ్రామంలోని మైత్రీ అనే యువతి గర్భం కన్ఫర్మ్ కావడంతో ముందు నుండి ప్రతినెల దేవి హాస్పిటల్ లో  గర్భవతికి కావలసిన వైద్యం చేయించుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా నెలలు నిండి మైత్రికి పురిటి నొప్పుల రావడంతో దేవి హాస్పిటల్ తీసుకు రావడం జరిగింది. వైద్యం చేసే క్రమంలో నొప్పులు వచ్చే సమయం లో నొప్పులు రాకుండా వైద్యులు సూదులు ఇచ్చారని మైత్రి తల్లి ఆరోపించింది.

అనంతరం వేరే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళండని వారు చెప్పడంతో బాధితులకు అనుమానం వచ్చి ఎందుకు తీసుకు వెళ్ళమని అంటున్నారని నిలదీశారు. వారు ఏమి సమాధానం చెప్పక పోవడంతో వారు గజ్వేల్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చూపించడంతో అప్పటికే కడుపులో బాబు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మైత్రి తండ్రీ నర్సింలు తల్లి కుటుంబ సభ్యులుతిరిగి దేవి హాస్పిటల్ కు వచ్చి ఆందోళనకు దిగి మాకు న్యాయం చేయాలని నిరసన తెలియచేసారు.