7 June, 2026 | 1:59 AM

జవహర్‌నగర్ దోపిడీ కేసులో నేపాల్ గ్యాంగ్ అరెస్టు

07-06-2026 12:00 AM

సొత్తు రికవరీ.. వివరాలు వెల్లడించిన సీపీ సుమతి 

మేడ్చల్, జూన్ 6 (విజయక్రాంతి): జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూరు లో రిటైర్డ్ ప్రొఫెసర్, అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ ఇంట్లో జరిగిన భారీ దోపిడి కేసులో మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద సొత్తు రికవ రీ చేశారు. కేసు వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొన్నేళ్లుగా దేశంలో నివసిస్తున్న నేపాలి జాతీయులు మీనా, రా జేష్ మురళీమోహన్ ఇంట్లో పనిలో చేరారు.

ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి వ్యూహం రచించారు. పథకం ప్రకారం సామ్రాట్, సబీనా అలియాస్ సునీత, డానియల్ చారో ఆలియాస్ చాంగు, కిరణ్ బిస్వాల్ అలియా స్ విస్వాల్, జంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్, కమల్ బహదూర్ చాలానే అనే నేపాలి జాతీయులు ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 11న సర్వెంట్ క్వార్టర్ లో పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారు.

రాజేష్, సబీన అలియాస్ సునీత, మీనా, డానియల్ చారు అలియాస్ చాంగు, సామ్రాట్ వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి వారిని బంధించి 60 తులాల బంగా రం, 15 కిలోల వెండి వస్తువులు, 3000 యూఎస్ డాలర్లు, రెండు సెల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు, 255 సీసీ కెమెరాలు పరిశీలించారు.

ఐదు రోజుల్లోనే గత నెల 16న ప్రధాన నిందితులు మీనా, రాజేష్, డానియల్ చారు అలియాస్ చాంగు, కిరణ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను శనివారం అరెస్టు చేశారు. ఈ కేసు ను చేదించిన పోలీసులను సిపి అభినందించారు.