27 July, 2026 | 12:51 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

07-06-2026 12:00 AM

ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మణ్

రాజేంద్రనగర్ జూన్ 6 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉందని చిలుకూరు ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మణ్ తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను పురస్కరించుకొని  శనివారం మంచిరేవుల ట్రెక్  పార్కులో పర్యావరణ మరియు అడవుల పరిరక్షణతో పాటు జీవవైద్యాన్ని కాపాడాలని ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు మొక్కల పెంపకం అడవుల ప్రాధాన్యత తదితర అంశాలపై ఉదయపు నడకలో భాగం గా ట్రెక్ పార్కుకు వచ్చిన మార్నింగ్ వాకర్స్ కు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో డిఆర్‌ఓ రవికుమార్ ఎఫ్‌ఎస్‌ఓ మమత. ఎఫ్‌బిఓ హరిబాబు ఈటిసిలు పాల్గొన్నారు.