జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది
12-06-2026 04:48 PM
బోథ్,(విజయక్రాంతి): జొన్న పంట కొనుగోళ్ల తో ప్రజా ప్రభుత్వం పైన రైతులకు భరోసా కలిగిందని బోతు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గుడాల శేఖర్ పేర్కొన్నారు.శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సోనాల మండలంలో 1068 రైతుల పంటను 31672 క్వింటాల జొన్న కొనుగోలు చేయడం జరిగిందన్నారు. లారీల కొరత ఉన్నప్పటికీ అధికారుల సహకారంతో పంటను తరలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పంట కొనుగోలు చేపట్టారని ఆయన తెలిపారు పంట కొనుగోళ్లకు సహకరించిన అధికారులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.






