హయత్‌నగర్‌లో నూతన న్యాయస్థానాలు
నేడు ప్రారంభించనున్న హైకోర్టు న్యాయమూర్తులు
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా జడ్జి తదితరులు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): హయత్‌నగర్‌లోని వాసపరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం 3.30 గంటలకు జరగనుంది. ఈ న్యాయస్థానాలను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండలు ప్రారంభించనున్నారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి ఏ కర్ణ కుమార్, సంబంధిత న్యాయాధికారులు ప్రి యాంక సిరిసిల్ల, ఫరీన్ బేగం, అలాగే ఇతర న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు పాల్గొననున్నారు. నేటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు రంగారెడ్డి జిల్లా ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి ఏ కర్ణ కుమార్ శుక్రవారం నూతన కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా హయత్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి. లింగం గౌడ్, జనరల్ సెక్రటరీ ఏ. రామ్ మోహన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జిల్లా జడ్జిని కలిశా రు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వేదిక, కోర్టు ప్రాంగణం, న్యాయమూర్తులు, అతిథుల స్వాగత ఏర్పాట్లు, న్యా యవాదుల కోసం చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా జడ్జి పరిశీలించి, అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అందించారు.
అదేవిధంగా రంగారెడ్డి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వినోద్‌కుమార్ కూడా ఏర్పాట్లను పరిశీలించి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ క మిటీ సభ్యులకు పలు సూచనలు, సలహాలు అందించారు. నూతన కోర్టుల ప్రారంభోత్స వం హయత్‌నగర్ ప్రాంతంలో న్యాయ పరిపాలనకు మరింత సౌలభ్యం కల్పించే ముఖ్యమైన కార్యక్రమంగా నిలవనుందని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.