పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని న్యూ డెమోక్రసీ రాస్తారోకో
కూసుమంచి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కూసుమంచి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై 2:35 డీసెల్ 15 రూపాయలు పెంచటం వల్ల నిత్యావసర వస్తువుల రెట్లు, రవాణా చార్జీలు రైతుల భూముల దున్నే యంత్రాల రెట్లు అమాంతం పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు రైతులు కార్మికులు సామాన్యులపై కోట్ల రూపాయల భారం పడి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారి భారతదేశ సార్వభౌమ ధికారాన్ని ట్రంపు కాల దగ్గర తాకట్టు పెట్టాడని. ట్రంపు ఆదేశాల అనుసారంగానే పనిచేస్తున్నాడు. మన దేశానికి కావలసిన పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ఎక్కడ కొనమంటే అక్కడ కొంటున్నాడని విమర్శించారు. మన దేశానికి ఇరాన్ మిత్ర దేశం అయినప్పటికీ ఆ దేశం మీద అమెరికా ఇజ్రాయిల్ ఆ ప్రజాస్వామికంగా దాడి చేసి ఆ దేశ సుప్రీమ్ అయ తుల్లా కమ్మేని నీ హత్య చేసిన ఖండించలేని స్థితిలో మోడీ ఉన్నాడని అన్నారు. ఆసియా దేశాలపైన పెత్తనం కోసం ఆదేశాలలో ఉన్న ఆయిల్ వనరులు దోచుకోవటం కోసం అమెరికా చేస్తున్న యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఇరాన్ హర్మోజ్ జలసందిని మూసి వేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
అయినా మన దేశానికి రష్యా తక్కువ ధరకు ఆయిల్ ను సప్లై చేస్తామని చెప్పినప్పటికీ. ట్రంపు ఈ నెల రోజులు రష్యా వద్ద ఆయిల్ కొనుగోలు చేయవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన కూడా మోడీ పెట్రోలు డీజిలు రేట్లు పెంచి ప్రజలపై భారం వేయటం అత్యంత దారుణమని అన్నారు. ఇప్పటికే ప్రజలు వంట గ్యాస్ దొరకక ఒక్క సిలిండర్ 2000 నుండి 3000 పెట్టి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇది చాలద నెట్టు మరల పెట్రోల్. డీజిల్. రేట్లు పెంచడం సిగ్గు సేటు అన్నారు. ఇప్పటికైనా పెంచిన రేట్లను వెంటనే తగ్గించి ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు మాతంగి రామస్వామి. చెరుకుపల్లి వీరయ్య.బుర్ర సైదులు. బత్తుల ఉప్పలయ్య. మల్సూరు. కోటయ్య. వీరభద్ర0. రాజేష్. ప్రకాష్. మల్లేష్.తదితరులు పాల్గొన్నారు.




