calender_icon.png 29 September, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ భవన్ లో నూతన మదర్ డైరీ డైరెక్టర్లు

29-09-2025 05:50:55 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి సంధిల భాస్కర్ గౌడ్ ఈరోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మదర్ డైరీ డైరెక్టర్ సంధిల భాస్కర్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, రాజాపేట మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్, మాజీ ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, మదర్ డైరీ మాజీ డైరెక్టర్ చింతలపూడి వెంకట్రాంరెడ్డి, మండల యువజన అధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు ఎర్రగోగకుల జస్వంత్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం నరసింహులు, మాజీ సర్పంచులు రామిండ్ల నరేందర్, మాధవ్రామిండ్ల నరేందర్, మాడోత్ రాముల నాయక్, లక్ష్మణ్ నాయక్, పాల సంఘం చైర్మన్లు నీల బిక్షపతి, బాలరాజు రెడ్డి, ఒగ్గు బిక్షపతి, ఉప్పలయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు..