calender_icon.png 29 September, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండరీపూర్ మహా పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ..

29-09-2025 05:55:34 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోనీ స్వయంభు సోమలింగేశ్వర ఆలయంలో సోమవారం పండరీపూర్ మహా పాదయాత్ర పోస్టర్లను స్వాములు ఆవిష్కరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండరీపూర్​ పాదయాత్ర స్వాముల సంఘం అధ్యక్షుడు రాములు మహారాజ్ స్వామి, నాందేవ్ మహారాజ్ స్వామి కమిటీ సభ్యులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 17 నుంచి సోమలింగేశ్వర ఆలయం నుంచి పండరీ​పూర్ మహా పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమంలో దేశాయిపేట్ మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్, బోర్లం గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు పెద్ద పట్లోళ్ల పర్వారెడ్డి, బీర్పూర్ మాజీ ఎంపీపీ నారా గౌడ్, దుర్కి మాజీ సర్పంచ్ మోహన్, గోపనపల్లి సాయిలు, సయ్యద్ జలీల్, మన్నె చిన్న సాయిలు, మన్నె రమేష్, కాపర్తి భరత్, పాదయాత్ర స్వాములు కబీర్, భూమయ్య, కిష్టయ్య, మంద సాయిలు, విట్టల్ మహారాజ్, కిషోర్, పండరి, భాస్కర్, అంబయ్య తదితరులు పాల్గొన్నారు.