29-09-2025 05:47:31 PM
మైసూరు బేకరీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే..
రేగొండ (విజయక్రాంతి): వ్యాపార కేంద్రాలతో ప్రజలకు సేవ చేస్తూనే ఉపాధి పొందవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన మైసూర్ బేకరి, స్వీట్ షాపును సోమవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన బేకరి స్వీట్స్, తిను బండారాలు అందజేయాలని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మైసూర్ బేకరి, స్వీట్స్ షాప్ యజమానులకు అభినందనలు తెలిపి అనంతరం బేకరి యజమాని మునిస్వామిని శాలువతో సన్మానించి మండల ప్రజలకు, నాణ్యమైన స్వీట్స్ అందించాలని కోరారు. వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ చైర్మన్ రాష్ట్ర నాయకులు నాయినేని సంపత్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, మేకల బిక్షపతి, గంగుల రమణారెడ్డి,మాజీ ఎంపిటిసి సుమలత బిక్షపతి పట్టెం శంకర్, రేగొండ మండల మహిళా మండలి అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద రాణి ,కాంగ్రెస్ పార్టీ రేగొండ టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, లింగాల గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకుల మల్లయ్య, బుగులోని జాతర మాజీ చైర్మన్ రొంటాల వెంకటస్వామి, తిరుమలగిరి గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,రూపురెడ్డి పల్లె మాజీ సర్పంచ్ బండారి కవిత దేవేందర్, జగ్గయ్యపేట సర్పంచ్ పాత పెళ్లి సంతోష్,మండల సీనియర్ నాయకుడు మటికే సంతోష్,ఉమ్మడి మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు పొనుగోటి వీర బ్రహ్మం,గోరి కొత్తపల్లి మాజీ సర్పంచ్ సూదనబోయిన ఓం ప్రకాష్,సత్తన్న యువసేన అధ్యక్షులు మోట్టే కిరణ్ పటేల్, సత్తన్న యువసేన నాయకులు సామల సురేందర్ రెడ్డి,మైసూర్ బేకరి నిర్వాహకులు ముకేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.