29-07-2025 01:09:28 AM
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, జూలై ౨౮ (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను అందిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం సారంగపూర్ మండల కౌట్లలో కలెక్టర్ అభిలాష అభినవ్ కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభు త్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డు లు పేదలకు వరంగా మారాయన్నారు. సారంగాపూర్ మండలంలో 1425 కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 10,325 కార్డులు మంజూరుతో పాటు 2000పైగా రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చ డం జరిగిందని, ఇంకా అర్హులైన వారు ఉం టే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప్రజ లు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, అదనపు కలెక్టర్ కిషోర్ కుమా ర్, ఆర్డీవో రత్న కళ్యాణి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.