calender_icon.png 29 July, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాల డిజిటలైజేషన్‌కు కృషి

29-07-2025 01:08:17 AM

నూతన జిల్లా చైర్మన్ నర్సయ్య

ఆదిలాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రంథాలయా లను డిజిటలైజేషన్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాల య సంస్థ నూతన చైర్మన్ మల్లెపూల నర్స య్య అన్నారు. సోమవారం తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శివ కుమార్ నేతృత్వంలో గజిటెడ్ అధికారుల సంఘం నేతలు జిల్లా చైర్మన్‌గా ఎన్నికైనందున నర్సయ్య ను శాలువా, పూల బొకేతో సత్కరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం వారికి కావలసిన సిలబస్, సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలోని అన్ని గ్రంథాలయాల డిజిటలైజేషన్‌కు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే పాఠకుల కోసం అన్ని రకాల పుస్తకాలు అందుబాటు లో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్ మా ట్లాడుతూ ఉన్నత విద్యావంతుడైన నర్సయ్య ను జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌గా నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి డాక్టర్ రామారావు, అసోసియేట్ అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు రాజేష్, వామన్ రావు, అరుణ, సంయుక్త కార్యదర్శి అనిల్, కోశాధికారి రోడ్డ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.