నల్లగండ్లలో కొత్త షాపింగ్ డెస్టినేషన్
శుభప్రదం షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన శృతి హాసన్
సినీనటి రాకతో భారీగా వచ్చిన అభిమానులు
శేరిలింగంపల్లి, జూలై 3 (విజయక్రాంతి): నల్లగండ్ల ప్రాంత వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేలా శుభప్రదం షాపింగ్ మాల్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి శృతి హాసన్ రిబ్బన్ కట్ చేసి మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. శృతి హాసన్ వస్తున్నారని తెలియడంతో ఉదయం నుంచే మాల్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆమె రాకతో మాల్ పరిసరాలు సందడిగా మారాయి.
ప్రారంభోత్సవం అనంతరం మాల్‌లోని వివిధ షోరూంలను ఆమె పరిశీలించారు. అభిమానులతో కాసేపు ముచ్చటించి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా మాల్ యాజమాన్యం మాట్లాడుతూ నగర శివారు ప్రజలకు మెట్రో తరహా షాపింగ్ సౌకర్యం కల్పించాలన్నదే మా లక్ష్యం. సంప్రదాయ వస్త్రాలు, పార్టీ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఫుట్వేర్, కాస్మెటిక్స్, గృహోపకరణాలు.. ఇలా అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను ఒకేచోట అందుబాటులో ఉంచాం. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లోనే నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాల్ ఛైర్మన్, డైరెక్టర్లు, స్థానిక కార్పొరేటర్, వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు.






