న్యూజిలాండ్ మహిళల అద్భుతం
347 పరుగుల రికార్డు ఛేజింగ్
వెల్లింగ్టన్, ఏప్రిల్ 1 : మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది. మ హిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. న్యూజిలాండ్ మహిళల జట్టు ఏకం గా 347 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి.. వన్డే చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. చి వరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ హాఫ్ సెంచ రీలతో రాణించగా.... చివర్లో ట్రయాన్ కేవ లం 25 బంతుల్లోనే 52 పరుగులతో మెరు పు ఇన్నింగ్స్ ఆడింది. న్యూజిలాండ్ గెలుపు లో ఆ జట్టు కెప్టెన్ అమేలియా కెర్ కీలక పా త్ర పోషించింది. 347 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జట్టు వికెట్లు కోల్పోతున్నా.. అమేలియా కెర్ మాత్రం చివరి వరకు పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చింది.




