07-02-2026 12:37:27 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): భారతదేశంలోప్రతిఏటా పదిలక్షల మంది నవజాతశిశువులు మరణిస్తున్నారు. ఇందులో ఐదులో నాలుగు మరణాలు ప్రధానంగా పుట్టిన వెంటనే శ్వాస ఆడకపోవడం, నెలలు నిండకుండానే పుట్టడం, సంక్రమణలు వంటి నివారించదగిన కారణాలవల్లే సంభవిస్తున్నాయి.
తెలంగాణలో నవ జాతశిశు మరణాలరేటు ప్రతి 1000 జననాలకు 25గాఉంది. ఇది జాతీయ సగటు 28 కంటే తక్కువ. అయినప్పటికీ, దక్షిణ భారతదేశ రాష్ట్రాలలోఇదే అత్యధికం. దేశంలో లోప్రతి10 సెకనులకి ఒకరు మరణిస్తున్నా రు. కేవలం నవజాతశిశువుల పైనే కాకుండా, కౌమారదశ నుంచి గర్భధారణ, ప్రసవ సమయం వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారాఈమరణాలను నివారించ వచ్చు.
తెలంగాణలోని సంగారెడ్డిజిల్లా ఇస్నాపూర్ మండలం, చిట్కుల్ గ్రామంలోని మహేశ్వర మెడికల్ కాలేజీలో నవజా తశిశు సంరక్షణ, పునరుజ్జీవనంపై గతేడాది డిసెంబర్ 13, 14 తేదీల్లో, జనవరి 9, 23, ఫిడ్రవరి 6 తేదీల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించింది. శ్వాసఆడకపోవడం, పాలు సరి గా తాగకపోవడం, హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం),ఇన్ఫెక్షన్లసంక్రమణలు) వల్ల సంభవించే నవజాతశిశు మరణాలను అరికట్టడంలో వైద్యులు, నర్సుల నైపు ణ్యాలను మెరుగుపర్చడం ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్ధేశ్యం.
ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్సీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కృషారావు మాట్లాడుతూ... మా కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి అన్ని విభాగాలలో క్లినికల్స్ స మావేశాలను క్రమంతప్పకుండా నిర్వహించడం ద్వారా వైద్యులు, నర్సులనైపుణ్యాలను మెరుగుపరచడానికి అనేకచర్యలు తీసుకుంటోంది అన్నారు.
అమెరికన్ అకాడమీ ఆఫ్పీ డియాట్రిక్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్పీడియాట్రిక్స్మరియునేషనల్నియోనాటాలజీఫోరమ్లాటర్డేసెయింట్స్చారిటీస్, జాన్సన్‌అండ్జాన్సన్, ఫోగ్సీ, సోమీ, గివ్2ఏషియా సంయు క్తంగారూపొందించిన, ఈ ‘నవజాత శిశు సంరక్షణ పునరుజ్జీవన’ (నియోనాటల్రీససిటేషన్)వర్క్‌షాపు నిర్వహించామన్నారు.
భవిష్యత్ వైద్య సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను ఈ వర్క్‌షాప్ అం దిస్తుందన్నారు. ఈ వర్క్‌షాపులో బాల చికి త్స విభాగం(పీడియాట్రిక్స్)ప్రొఫెసర్, కోర్సు డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, మమత మెడికల్ కాలేజీ డాక్టరు డేన్సాబ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డాక్టరు మప్రియ, మురళీకృష్ణ, డాక్టర్ ఉదయ్‌కాం త్, డాక్టర్ మంజునాథ్ ప్రసంగించారు.