calender_icon.png 8 February, 2026 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

07-02-2026 11:05:54 PM

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ అద్భుతమైన ఎడిషన్­తో ముగిసింది. గురుగ్రామ్, జైపూర్, కోల్­కతాల వ్యాప్తంగా ఫ్యాషన్ అనుభవాలకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఫ్యాషన్­లో ముందు ముందు రాబోయే పరిణామాలకు నాంది పలికే ‘ద వన్ ఎండ్ ఓన్లీ ని సృష్టించిన ఈ టూర్ వినూత్నంగా సాగింది.  బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఫ్యాషన్­ను ఏ విధంగా ప్రగతిపథంలో నడుపుతాయో అన్న అంశానికి నిదర్శనంగా నిలిచింది.

రియల్-టైమ్­లో టెక్నాలజీ మరియు దుస్తులు పరస్పరం మమేకమయ్యే ఫ్యూచర్­వర్స్ లోకి గురుగ్రామ్ ఫ్యాషన్­ను తీసుకొచ్చింది. డిజైనర్లు ఫాల్గుణి, షేన్ పీకాక్­ల గురుగ్రామ్ యొక్క 'ద ఫ్యూచర్­వర్స్ ఆఫ్ ఫ్యాషన్' హ్యుమనాయిడ్ రోబోట్లు, హోలోగ్రాఫిక్ సాంకేతికపరిజ్ఞానం, మరియు మోషన్-సెన్సింగ్ ప్రొజెక్షన్లతో చక్కని దుస్తులను రంగరించి, షాహిద్ కపూర్ , తమన్నా భాటియాలను ఫీచర్ చేశారు. 'హై ఆక్టేన్ కుట్యూర్'ను జైపూర్, నమ్రతా జోషీపురా, అభిషేక్ పట్నీలతో కలిసి ఆవిష్కరించారు. 

2100 మందికి పైగా హాజరైన ఈ టూర్ మూడు నగరాల్లో ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. డిజైనర్లు, సెలబ్రిటీలు, సాంస్కృతిక టేస్ట్­మేకర్లు, ఫ్యాషన్ లీడర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు , మీడియాల సమ్మేళనాన్ని జతపరుస్తూ అద్భుతమైన ఫ్యాషన్ షోను అందరికీ అందించింది. టూర్ ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఫ్యాషన్­లో దిశను నిర్దేశిస్తూ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్­ అద్భుతంగా సాగడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.