గూఢచర్యం కేసులో తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: విశాఖ- పాక్ గూఢచర్యం కేసులో ఏడు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహిస్తోంది. ఏడు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు చేసింది. రక్షణ సమాచారం పాక్ కు అందించిన అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు ప్రారంభించింది. నిన్న తెలంగాణ, గుజాత్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, కేరళ, బిహార్, కర్నాటకలో సోదాలు చేపట్టింది. 2021లో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. మరో కేసు నమోదు చేసి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. సరిహద్దు నుంచి నేవీ సమాచారాన్ని పాక్ కు లీక్ చేస్తున్నట్లు గుర్తించింది. 2023 జులైలో జరిపిన సోదాల్లో 22 ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. గూఢచర్యం కేసులోఅరెస్టు అయిన ఆకాష్ సోలంకిపై 2023 జులైలో ఛార్జ్ షీట్ దాఖాలు చేసింది. పరారీలో ఉన్న మీర్ బలాజ్ ఖాన్(పాక్)పై 2023 జులైలో, నవంబర్ లో సురేంద్ర పాండ, అల్విన్ పై అనుబంధ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. మరో పాకిస్థాన్ అమన్ సలీమ్ పై మేలో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.






