7 July, 2026 | 9:50 AM

పాస్‌పోర్టు సేవలు బంద్.. కారణం ఇదే

29-08-2024 01:45 PM

ఢిల్లీ: ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలకు స్వల్ప అంతరాయం కలగనుంది. గురువారం రాత్రి నుంచి ఐదు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్ మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని, అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్లు రీ షెడ్యూల్ అవుతాయని పేర్కొంది.

గురువారం రాత్రి ఎనిమిది గంటల(ఆగస్టు 29 ) నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల (సెప్టెంబరు 2 ) వరకు అందుబాటులో ఉండవు. ఆగస్టు 30కి చేసుకున్న అపాయింట్‌మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని, అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రీషెడ్యూల్ అవుతాయని పాస్ పోర్ట్ సేవా పోర్టల్ అధికారులు పేర్కొన్నారు.    కాగా దరఖాస్తు దారుడు పొందుపరిచిన చిరునామాకు చేరుతుంది. పాస్‌పోర్టును వేగంగా పొందేందుకు తత్కాల్ విధానాన్ని కూడా ఉపయోగించకోవచ్చు.