13 April, 2026 | 7:39 PM

పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి

19-08-2024 01:03 AM

12 మందికి అస్వస్థత.. ఒడిశాలో ఘటన 

ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం

భువనేశ్వర్, ఆగస్టు 18: ఒడిశాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి మొత్తం తొమ్మిది మం ది మృతిచెందారు. మరో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బాలాసోర్, మయూర్ భంజ్, కియోంజర్, ధెంకనల్, బర్గా, గంజాం, భద్రక్ జిల్లాల్లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లో పిడుగులు పడి తొమ్మిది మంది మృతిచెందారు. బర్గా జిల్లా మునుపాలి గ్రామ సమీపంలోని పొ లంలో కూలీలు పనిచేసుకుంటుండడగా పి డుగు పడింది. ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు తెలిసింది. పిడుగుపాటు ఘటనపై ము ఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివా రం స్పందించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, అస్వస్థతులైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని  ప్రకటించారు.