డెంగ్యూతో కేంద్రమంత్రి భార్య మృతి
19-08-2024 01:04 AM
భువనేశ్వర్, ఆగస్టు 18: దేశంలో డెంగ్యూ విపత్తుకు అద్దం పట్టే వార్త ఇది. సాక్షాత్తు కేంద్ర మంత్రి సతీమణే డెంగ్యూతో మరణించారు. కేంద్రం గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య ఝింజియా ఓరం భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో డెంగ్యూకు చికిత్స పొందుతూ ఆది వారం కన్నుమూశారు. దేశవ్యాప్తంగా డెం గ్యూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కర్ణాటకలో గత మూడు నెలల్లోనే పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దోమలద్వారా సంక్రమించే ఈ వ్యాధితో ఏటా వందలమంది మరణిస్తున్నారు. వేలమంది దవా ఖాన పాలవుతున్నారు. డెంగ్యూ చికిత్సకు ప్రైవేటు దవాఖానలు లక్షల్లో ఫీజులు వసూ లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.




