థాయ్ కొత్తప్రధానిగా 37 ఏండ్ల మహిళ
19-08-2024 01:02 AM
బ్యాంకాక్, ఆగస్టు 18: థాయ్‌లాండ్ కొత్త ప్రధానిగా 37 ఏండ్ల మహిళ పాటోంగ్‌టర్న్ షినవత్ర నియామకానికి ఆ దేశ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ ఆమోదముద్ర వేశారు. ఆదేశానికి ఈమే అతిపిన్న వయసు ప్రధాని కావటం గమనార్హం. ఈమె మాజీ ప్రధాని తక్షిన్ షినవత్రి కుమార్తె. థాయ్‌లాండ్‌కు రెండో మహిళా ప్రధాని. గతంలో తక్షిన్ షినవత్ర సోదరి ఇంగ్‌లుక్ షినవత్రి ప్రధానిగా పనిచేశారు. తక్షిన్ షినవత్రను 2006లో మిలిటరీ తిరుగుబాటుతో పదవినుంచి దింపేశారు. మొన్నటివరకు ప్రధానిగా కొనసాగిన స్రెత్త థవిసిన్‌ను ఆ దేశ రాజ్యాంగ కోర్టు అవినీతి ఆరోపణలతో ప్రధాని పదవి నుంచి దింపేయటంతో రాజు పాటోంగ్‌టర్న్‌ను ప్రధానిగా నియమించారు.




