2 June, 2026 | 1:00 AM

మొక్కజొన్నలో నిర్మల్ అగ్రస్థానం

02-06-2026 12:26 AM
  1. లక్ష్యం 1.21 లక్షలమెట్రిక్ టన్నులు.. కొన్నది 1.61 లక్షల టన్నులు
  2. ఇప్పటికి 80% పంట తరలింపు 
  3. రైతుల ఖాతాలో  జమ
  4. కలెక్టర్ ప్రత్యేక చొరవ 
  5. రైతులకు ప్రయోజనం 

నిర్మల్ జూన్ 1 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మొక్కజొన్నలు సాగుచేసిన రైతులకు పంట పండింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్మల్ లోని మొక్కజొన్న అత్యధికంగా సాగు చేయగా కొనుగోళ్లలో కూడా నిర్మల్ రికార్డులు నిలిపింది. ఉమ్మడి అదిలాబాద్ చరిత్రలో ఇప్పటివరకు మొక్కజొన్న సాగులో ఇదే రికార్డు. నిర్మల్ జిల్లాలో ప్రభు త్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెం టు అందించడం, యాసంగిలో మొక్కజొన్న లాభదాయకం కావడంతో ఈ పంట వైపే మొగ్గు చూపారు.

యాసంగిలో రైతులు పండించిన ప్రధాన మొక్కజొన్న జొన్న వరి పొద్దు తిరుగుడు వేరుశనగ, పంటలు సాగు చేశారు. ఇందులో వరి మొక్కజొన్న 80% సాగు చేశారు. మొక్కజొన్న కొనుగోలలో నిర్మల్ తెలంగాణ రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచింది. నిర్మల్ జిల్లా చరిత్రలో రికార్డ్ స్థాయిలో మొక్కజొన్నలు కొనుగోలు చేయడంతో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచిన ట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో యా సంగిలో 2.60 లక్షల ఎకరాల పంట సాగు చేయగా ఇందులో ప్రధానంగా లక్ష పదివేల ఎకరాలు మొక్కజొన్న సాగు సాగు చేయగా 1,20,000 ఎకరాలు వారి సాగు చేశారు.

జిల్లాలో 74 వేల వ్యవసాయ మోటర్లు ఉం డగా ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరా ఇవ్వడంతో మొక్కజొన్న సాగులు గణ నీయంగా పెంచుకున్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ సారంగాపూర్ మామడా లక్ష్మణ జెండా కుబీర్ కుంటాల లోకేశ్వరం నర్సాపూర్ సోన్ దిల్వార్పూర్ మామడ కడెం ఖానాపూర్ పెద్దూర్ పెద్ద ప్రాంతాల్లో యా సంగిలో రైతులు మొక్కజొన్నకి ప్రాధాన్యత ఇచ్చారు. పంట కాలం వంద రోజులు కావడం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడు లు సాధించారు.

కూలీల కొరత . యాం ద్రీకరణ. పంటకు పెట్టుబడులు తక్కువగా ఉండడం, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కృషి భూగర్భ జలాల వృద్ధి ఏర్పడడం, మొక్కజొన్న సాగుకు ఉపయోగపడ్డాయి. గతంలో పొద్దుతిరుగుడు వేరుశనగె నువ్వు,. జొన్న, ఎర్ర జొన్న,. వంటి పంటలు సాగు చేసేవారు. ఆ పంట కొనుగోలు ప్రభు త్వ కొ నుగోలు కేం ద్రాలు నిర్వ హణ లేకపోవడం తో మొక్కకు ప్రభుత్వం మ ద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం మార్కెట్లో డి మాండ్ ఉంటుందన్న ఆశతో జి ల్లా రైతాంగం మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు రైతులు తెలిపారు.

రికార్డ్ స్థాయిలో పంట దిగుబడులు 

నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న సాగు సాగు చేయగా కాలం కూడా కలిసి రావడంతో పం ట దిగుబడులు గణనీయంగా పెరిగినట్టు రైతులు తెలిపారు. జిల్లాలో లక్ష పదివేల ఎకరాలు మొక్కజొన్నలు సాగు చేశారు. జిల్లా లో ఇప్పటివరకు 1.80 లక్షల మెట్రిక్‌టన్నుల మొక్కజొన్న పంట పండించారు. ఇందులో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. ప్రైవేట్ లో కేవలం 200 మెట్రిక్ టన్నులు మాత్రమే విక్రయించుకున్నారు.

నిర్మ ల్ జిల్లాలో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మొ క్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యం కుమించి అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల అదనపు మొక్కజొన్న ను కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా మా ర్క్ఫెడ్ ఆధ్వర్యంలో 24 ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలను నెల రోజుల క్రితమే ప్రారంభించింది. ప్రభుత్వం మొక్కజొన్న పంటకు రూ. 2400 మద్దతు ధర ప్రకటించగా ప్రవేట్ లో రూ 1750 నుండి 1800 మాత్ర మే కొనుగోలు చేశారు. దీంతో రైతులు ప్రైవేట్ కు వి క్రయిస్తే 650 రూపాయలు నష్టపోతామని భావించి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైన ప్ర భుత్వం మద్దతు ధరపై ఆశలు పెంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించారు.

దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న ధాన్యం పోటెత్తింది. ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా లక్ష్యం1.20 లక్షల మెట్టు టన్నుల ధాన్యం ఉన్నప్పటికీ రై తుల నష్టపోకుండా ఉండేందుకు టా ర్గెట్లు ఎప్పటికప్పుడు పెంచారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యవసాయ అధికారులతో స ర్వే నిర్వహించి నిజమైన రైతుల మొక్కజొన్నను సంపూర్ణంగా కొనుగోలు చేయాలని సూచించారు.

మరోవైపు లారీలు గోన సంచల, కూలీల కొరత ను గుర్తించిన అధికారులు ప్రత్యేకంగా కలకత్తా బీహార్ నుంచి కూలీలను రప్పించారు. అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పోలీసు రెవెన్యూ వ్యవసాయ శాఖ రవాణా శాఖ అధికారుల సమన్వయంతో పంట కొనుగోలు, కొనుగోలు చేసిన పంటను గోధుమలు తరలిం చేందుకు ట్రాన్స్పోర్ట్, గోన సంచుల కొరత, కూలీల షిఫ్టింగ్, నిలువ చేస్తే గోదాముల వ ద్ద అన్లోడింగ్ కార్మికులు పెంచారు.

జిల్లాలోని కాకుండా మహారాష్ట్ర పెద్దపల్లి కరీంనగర్ నిజాంబాద్ జిల్లాలో గోదా ములను సేకరించి ప్రతిరోజు 50 లారీల వరకు మొక్కజొన్నలు ట్రాన్స్పోర్ట్ చేశారు.. ప్రతిరోజు ఉద యం సాయంత్రం క్షేత్రస్థాయి లో జిల్లా వ్యా ప్తంగా పర్యటించి పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా నిర్వహించడమే కుండా పంట తరలింపు ప్రక్రియను వేగంగా చే పట్టేందుకు అ ధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతు ల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకుం టూ పంట తరలింపు ప్ర క్రియ పూర్తి చేశారు.

దీనికి తోడు రైతులు పంట తూకం వేసుకొని సొంతగా గోన సంచులు తెచ్చుకుని ట్రా న్స్పోర్ట్ చేసుకుంటే వా టి సంబందించిన డ బ్బులను రైతు ఖాతా లో జమ చేస్తామని ప్ర చారం చేయడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంట తరలింపులో స్వయంగా భాగస్వామిలయ్యారు. గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పడి తూకం వేయడం లోడిం గ్ చేసి ట్రాక్టర్లు ప్రై వేటు లారీలు సహకారంతో గోదారులకు త రలించగా వారి ఫేస్ లు టోకెన్ నెంబర్ అ న్ని వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమో దు చేసి మొక్కజొన్న ఖాతా డబ్బులు రైతు ఖాతాలో పడేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు .

రైతు ఖాతాలో డబ్బులు జమ

నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న సాగుచేసిన రైతులకు గత రెండు మూడు రోజుల నుంచి రైతు ఖాతాలో మొక్కజొన్న డబ్బులు జమ అవుతున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది రైతుల నగదును రైతు ఖాతాలో జమ అయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న సాగు చేసింది రైతులు పంట అమ్ముకోవడంలో కొంత జాతకం జరిగిన అధికారులు తీసుకున్న సత్ఫలితాలతో వేగంగా పూర్తి పంట కొనుగోలు పూర్తి చేసుకోవడం మొక్కజొన్న డబ్బులు తమ ఖాతాల్లో చమక్కోవడంతో ఖరీఫ్ సీజన్ పెట్టుబడులకు ఈ డబ్బులు ఇందాక ఉపయోగప డతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరో వారం రోజులు మృగశిర కార్తి ప్రారంభమై వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొక్కజొన్న పంట ఆదాయంతో ఇప్పటికీ రైతులు వేసవి దిక్కులను దున్నుకోవడం, విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసి వర్షం కురిస్తే పంటలు విత్తుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. 

రైతు ఖాతాలో డబ్బులు జమ 

మొక్కజొన్న విక్రయించిన రైతులకు గత మూడు రోజుల నుంచి రైతు ఖాతా లో మొక్కజొన్న డబ్బులు జమ చేయ డం చాలా సంతోషంగా ఉంది. మరో వారం రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంట పెట్టుబడులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తమకు మొక్కజొన్న పంట డబ్బు లు ఉపయోగప డతాయని భావిస్తు న్నాం.  

ఇగ్గం రాజన్న రైతు

రైతుల ప్రజల కోసమే టార్గెట్ పెంచాం 

నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు లో తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ అగ్రస్థానంలో నిలిచింది. మొక్కజొన్న కొనుగోలు1.10 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈసారి పంట దిగుబడుదు పెరిగిన నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని 1.61 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 90 శాతం మొక్కజొన్నను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించుకునేలా ప్రోత్సహించిన.

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా