7 May, 2026 | 1:51 AM

నితిన్ కొత్త సినిమా ప్రారంభం

07-05-2026 01:05 AM

ప్రముఖ కథానాయకుడు నితిన్ కొత్త సినిమా బుధవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నా రు. దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖ ర్ టీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయిక.

సురేశ్ బొబ్బిలి సంగీ తం అందిస్తుండగా.. డీవోపీగా అనిత్ మదాడి, ఆర్ట్ డైరెక్టర్‌గా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.