15 June, 2026 | 8:45 PM

Breaking News

సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •  

రాజన్న సన్నిధిలో నిత్యాన్నదానం!

30-08-2024 12:45 AM

తిరుమల తరహాలో తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమయిన వేముల వాడలో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం సంతోషకరం.  రాష్ట్రంలో యాదాద్రి తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. నిత్యం వేలాది మంది రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ భక్తుల కోసం నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. ఇందుకోసం దాతలు ముందుకు వచ్చి ఉదారంగా విరాళాలు సమర్పించాలని మంత్రి కోరారు. దీనివల్ల భక్తులకు పుణ్యంతో పాటు పురుషార్థం కూడా లభిస్తుంది. తిరుమల వెంకన్న కోసం కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చే భక్తులు ఈ మంచి కార్యానికి కూడా సహకరిస్తారని ఆశిద్దాం.

  సుబ్రహ్మణ్య శర్మ,  కేపీహెచ్‌బీ కాలనీ