No Helmet, No Entry: రూల్స్ పాటించాల్సిందే...!
హెల్మెట్ లేకుంటే కార్యాలయాలకు నో ఎంట్రీ
పెట్రోల్ పంపుల వద్ద నో హెల్మెట్- నో పెట్రోల్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలను(Traffic regulations) కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం మేరకు జిల్లా యంత్రాంగం అమలకు శ్రీకారం చుట్టింది.కలెక్టరేట్,ఎస్పీ కార్యాలయం వద్ద హెల్మెట్ లేనిది ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ ని నియమించారు.హెల్మెట్(helmet) లేకుండా వస్తున్న వాహనదారులను లోనికి అనుమతించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను కాంపౌండ్ బయట పెట్టి లోనికి వెళుతున్నారు.
పెట్రోల్ పంపు ల వద్ద కూడా హెల్మెట్ లేకుంటే ద్విచక్ర వాహనాలలో(Two-wheelers) పెట్రోల్ పోయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి నెలకొంది.రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు కఠినంగా వ్యవహరించడం పట్ల ప్రజలు హర్షిస్తున్నారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని అధికారులు తెలుపుతున్నారు. అధికారుల చర్యలతో వాహన దారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మారుతుంది.నిబంధనలను రానున్న రోజుల్లోనూ ఇదేవిధంగా అనుసరిస్తే మార్పు అనివార్యమే అవుతుంది.మున్నాళ్ల ముచ్చటగా వ్యవహరిస్తే మాత్రం వాహన దారుల్లో మార్పు రాదు అనే వాదనలు వినిపిస్తున్నాయి.






