calender_icon.png 20 February, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయం లేదు శర్మా

20-02-2026 01:12:15 AM

టీ20 క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌కు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు డకౌట్లతో అభిషేక్ శర్మ అటు టీమ్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. ఈ యువ ఓపెనర్ పేలవ ఫామ్‌తో ఇప్పుడు సంజూకు మద్ధతు పెరుగుతోంది. ఒకటిరెండు వైఫల్యాలకే సంజూను పక్కన పెట్టిన మేనేజ్‌మెంట్ అభిషేక్ విషయంలో ఎందుకు భిన్నంగా ఉంటుందన్న చర్చ మొదలైంది. దీంతో సూపర్ స్టేజ్‌లో ఓపెనర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

  1. డకౌట్లతో షాకిస్తున్న అభిషేక్ 

సంజూకు పెరిగిన మద్ధతు 

సూపర్ ఛాన్స్ ఎవరికో ?

అహ్మదాబాద్, ఫిబ్రవరి 19 : గత ఏడాది ఆసియాకప్ నుంచీ టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న భారత బ్యాటర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అభిషేక్ శర్మ... ఈ యువ ఓపెనర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు లెక్కే లేదు. భారీ సిక్సర్లతో ప్రత్య ర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పవర్ ప్లేలో మరే బ్యాటర్‌కూ లేని స్ట్రుక్‌రేట్‌తో ఆడుతూ చెలరేగిపోతున్నా డు. అత్యంత నిలకడగా రాణిస్తూ కొద్ది కాలంలోనే నెంబర్ వన్ బ్యా టర్‌గా ఎదిగాడు.

దీంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు అభిషేక్‌పై అంచనాలు పెరిగిపోయా యి. తీరా టోర్నీ మొదలైన తర్వాత సీన్ మొత్తం రివర్సయింది. ఆడిన మూడు మ్యాచ్ల్ లోనూ డకౌటయ్యాడు.  అమెరికాపై గోల్డె న్ డక్ ఔట్ అయిన అభిషేక్ శర్మ.. అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్ ఆడలే దు. మళ్లీ పాకిస్థాన్‌పై రీఎంట్రీ ఇచ్చి డకౌటయ్యాడు. ఇక నెదర్లాండ్స్ పై చెలరేగిపో తాడనుకుంటే అస్సలు ఖాతా నే తెరవలేదు.

దీంతో ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ డకౌటైన బ్యాటర్‌గా చెత్త రికార్డును మూ టగట్టుకున్నాడు. అభిషేక్ శర్మ ఆడిన గత 7 ఇన్నింగ్స్‌లలో నాలుగు  సార్లు డకౌటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత 7 ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో వరుసగా మూడు డకౌట్స్ ఉండ టం, కీలక సూపర్-8 దశ ముందు అత ను ఫామ్ కోల్పోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ పేలవ ప్రదర్శనతో అభిషేక్ శర్మ తనపేరిట ప లు చెత్త రికార్డును లిఖించుకున్నాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి భారత ఓపెనర్‌గా కూడా అభిషేక్ శర్మ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా ఈ చెత్త ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయుబ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

గతేడాది అతను 6 సార్లు డకౌటయ్యాడు.వరుసగా మూడు మ్యాచ్‌లో అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని జట్టు నుంచి తప్పించి సంజూ శాంసన్‌కు ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ బంతినీ గుడ్డి గా ఆడడం జట్టుకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. ఫియర్లెస్ గేమ్ ముఖ్య మేనని, కానీ డకౌట్లు వద్దని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒకటిరెండు మ్యాచ్‌లలో ఫెయిలైన వెంటనే సంజూను పక్కన టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్‌కు వరుసగా ఎందుకు అవకాశాలిస్తోందని ప్రశ్ని స్తున్నారు. ఈ విషయంలో గంభీర్ వ్యూహాలను తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అభిషేక్ ఒత్తిడిలో ఉన్నాడని, అతనికి రెస్ట్ ఇచ్చి మళ్లీ కాన్ఫిడెన్స్ పెంచుకునేందుకు గంభీర్ సాయం చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో సంజూకు మరొక్క అవకాశం ఇచ్చి చూడాలంటున్నారు.

ఈ విషయంలో సూర్యకుమార్, గంభీర్ సరైన నిర్ణయం తీసుకోవా ల్సిన టైమ్ వచ్చిందంటూ సంజూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాజీలు మాత్రం అభిషేక్ శర్మకే మద్ధతుగా నిలుస్తున్నారు. ఒక్కో ఆటగాడికి ఒక్కో బ్యాడ్ ఫేజ్ ఉంటుందని, అభిషేక్ టా లెంట్‌ను తక్కువ చేసి మాట్లాడొద్దంటూ హితవు పలుకుతున్నారు. అతను మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు ఒక్క మ్యాచ్ చాలంటున్నారు.