30 May, 2026 | 10:44 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఫైనల్లో భారత్ ఏ మహిళల జట్టు

21-02-2026 01:20 AM

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్

బ్యాంకాక్, ఫిబ్రవరి 20: మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది. సెమీఫైనల్లో భారత్ ఏ వుమెన్స్ టీమ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక  ఆరంభంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఓపెనర్ సంజన 31, శసినీ(22) పరుగులతో రాణించారు. నిజానికి లంక భారీస్కోరు చేస్తుంద నుకుంటే భారత కెప్టెన్ రాధా యాదవ్ దెబ్బ కు లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టా రు. దీంతో శ్రీలంక  19.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ప్రేమ రావత్, తనుజా కన్వర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సైమా ఠాకూర్, మిన్ను మణి లు తలా ఓ వికెట్ పడగొట్టా రు. తర్వాత బృందా దినేష్ 20 బంతుల్లో 8 ఫోర్లతో 42 , రాధా యాదవ్ కెప్టెన్ రాధా యాదవ్ (31 నాటౌట్; 18 బంతుల్లో 7 ఫోర్లు), అనుష్క శర్మ(27; 18 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో 119 పరుగుల లక్ష్యా న్ని భారత్-ఏ జట్టు 13.3 ఓవర్లలో ఐదు వికె ట్లు కోల్పోయి ఛేదించింది.  ఫైనల్లో భారత మహిళలు బంగ్లాదేశ్‌తో  తలపడతారు.