23 May, 2026 | 1:49 AM

నేల రాలుతున్న నిషాచరాలు

23-05-2026 12:39 AM
  1. గబ్బిలాలకు కేరాఫ్ కోమటిపల్లి
  2. రెండురోజులుగా ఎండలకు ప్రాణాలు విడుస్తున్న అరుదైన పక్షి జాతి
  3. గతంలో చెట్ల వద్ద కూలర్లు, స్పింక్లర్లు ఏర్పాటు చేసిన దాతలు
  4. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

మహబూబాబాద్, మే 22 (విజయక్రాం తి): అరుదైన పక్షి జాతికి ఇంతకాలం ఆలవాలంగా నిలుస్తున్న మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో నిషాచార పక్షులు మండుటెండలను తట్టుకోలేక నేలరాలుతున్నాయి. పూర్వం నుంచి వే లాది గబ్బిలాలు కోమటిపల్లి లక్ష్మీనారాయ ణ స్వామి ఆలయ సమీపంలోని రావి చెట్టు, చెరువుగట్టుపై ఉన్న మర్రి చెట్లను ఆవాసం గా చేసుకుని జీవిస్తున్నాయి. గబ్బి లం అంటే అదోలా భావించే సమాజంలో ఈ గ్రామస్తులు మాత్రం ఎలాంటి హాని తలపెట్టకుం డా ఏళ్ల తరబడి వాటి ఉనికికి భంగం వాటిల్లకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దీం తో అరుదైన పక్షిజాతి ఆ గ్రామాన్ని వీడకుండా ఆ చెట్లను ఆవాసంగా చేసుకొని జీవి స్తున్నాయి.

వేసవి తీవ్రత నేపథ్యంలో ఆల య రావి చెట్టు నుంచి చెరువుగట్టుపై ఉన్న మర్రిచెట్టుకు మకాం మార్చాయి. అయినప్పటికీ రెండు రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగిపోవడంతో నిషాచర జీవులు ప్రాణా లు కోల్పోతున్నాయి. నిత్యం పదుల సంఖ్య లో గబ్బిలాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

అరుదైన పక్షి జాతి ఎండల తీవ్రత నేపథ్యంలో చనిపోతుండటంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఒకసారి ఇదేవిధంగా ఎండల తీవ్రత పరిస్థితి తలెత్తినప్పుడు అధికారులు, దాతలు ముం దుకు వచ్చి చెట్ల వద్ద ప్రత్యేకంగా కూలర్లు, స్పింక్లర్లను ఏర్పాటు చేసి కృత్రిమ చల్లదనంతో మిగిలిన గబ్బిలాల ప్రాణాలు పోకుం డా కాపాడగలిగారు. అయితే ఇప్పుడు అలాంటి ముందస్తు చర్యలేవి చేపట్టకపోవడంతో గబ్బిలాల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

పక్షి జాతిని సంరక్షించాలి

గబ్బిలాల పట్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నప్పటికీ మా గ్రామంలో ఏండ్ల తరబడి ఉంటున్న వాటి జోలికి ఎవరూ వెళ్లడం లేదు. పూర్వం నుంచి వాటిని కాపాడుకుంటూనే వస్తున్నాం. వేసవి తీ వ్రత నేపథ్యంలో గబ్బిలాలు రెండు రో జులుగా పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే అరుదైన పక్షి జాతిని సౌరక్షించేలా చర్య లు చేపట్టాలి. గబ్బిలాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కోమటిపల్లి పేరును కొన సాగించేలా కృషిచేయాలి. 

 మద్దెల బిక్షపతి, గ్రామ సర్పంచ్, కోమటిపల్లి