సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్నీ పరిశీలించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి.సెప్టెంబర్ 2.(విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణం(Sathupalli town)నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో సత్తుపల్లి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఆసుపత్రి సూపర్డెంట్ సురేష్ నాయక్ తో, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీతో కలిసి గతంలో సింగరేణి ఆధ్వర్యంలో అందించిన ఆసుపత్రి వైద్య పరీక్ష పరికరాలను పరిశీలించారు.
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి(Sathupally Government Hospital)లో ప్రజలకు అన్ని విధాల మెరుగైన వైద్యం అందించాలని, అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, వైద్య శాఖ మంత్రివర్యులు ఆద్వర్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే రాగమయి(MLA Ragamayi) తెలిపారు.... ఆసుపత్రిలోని రోగులకు పుష్టికరమైన, పోషక ఆహారం అందించాలని, క్వాలిటీ క్వాంటిటీ పెంచాలని కాంట్రాక్టర్కు మరియు సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వారికి వైద్య సహాయకారాలు అందించాలని డాక్టర్స్ కు తెలియజేశారు.... సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులను కలుసుకొని , వారితో ప్రత్యేకంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు వైద్య శాఖ మంత్రివర్యులకు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గురించి మెరుగైన వైద్య సహాయం కొరకు ఇంకా మరెన్నో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి త్వరలోనే ఇంకా అభివృద్ధి జరిగేలా చూస్తామని తెలియజేశారు.






