3 March, 2026 | 3:55 AM

నామినేటెడ్ కోలాహలం

03-03-2026 12:09 AM
  1. విధేయులకు పోస్ట్ దక్కుతుందా?

జెండా మోసినా కష్టానికి గుర్తింపు లభించేనా 

ఆమనగల్ మున్సిపల్ ఓటమి ప్రభావం పడేనా?

కడ్తాల్,మార్చి 2 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా జెండా మోసిన కల్వకుర్తి నియో జకవర్గ సీనియర్ నాయకుల్లో నామినేటెడ్ పదవుల ఆశలు చిగురించాయి. ఇటీవల పిసి సి అధ్యక్షుడు సైతం మార్చి 13 లోపు రాష్ట్ర జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదులకు భర్తీ చేసేందుకు అవకాశం ఉందని ప్రకటించడం తో ఇప్పుడే ఇప్పుడు అందరి చూపు నామినేటెడ్ పోస్టుల పై పడింది.

నియోజకవర్గంలో పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూ డా వెన్నుచూపకుండా, క్షేత్రస్థాయిలో కేడ ర్ను కాపాడుకుంటూ వచ్చిన నిఖార్సయిన నాయకులకు ఈసారి సముచిత స్థానం ద క్కుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గా ల్లో హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భారీ విజయం సాధించడంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కీలక నేతలు అహర్నిశలు శ్రమించారు.

ముఖ్యం గా మాడుగుల, ఆమనగల్, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో పార్టీ గెలుపునకు వ్యూ హకర్తలుగా వ్యవహరించిన నాయకుల కృషి ని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. ప్రధానంగా చర్చల్లో ఉన్న నాయకులను పరిశీలిస్తే మాడుగుల మండలం కు చెందిన పీ సీసీ సభ్యులు రామి రెడ్డి, భట్టు కిషన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సుద్ధపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ల తో పాటు మరికొందరూ మండలం లో పార్టీని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఆమనగల్ మండలం లో జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ డైరెక్టర్ వసుపుల జంగయ్య, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్య నేతగా గుర్తింపు పొందారు. అయితే గత కొంత కాలం గా ఎమ్మెల్యే, ఎం పీ లు తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కొంత ఆవేదన తో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.తలకొండపల్లి మండలం లో సీనియర్ నేత గా గుర్తిం పు పొందిన మాజీ ఎంపీపీ రఘురాములు క్షేత్రస్థాయిలో స్థానిక ఓటర్లను ప్రభావితం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

 కడ్తాల్ మండలం మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ ఎంపీటీసీ, పీసీసీ నాయకులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ గత కొంత కాలం గా ఏఐసీసీ నేత చల్లా వంశీ చందర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కి సఖ్యతగా ఉంటూ వస్తున్నాడు.

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కా ర్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్, రాష్ట్ర గిరిజన సంఘం నేత హనుమాన్ నాయక్ లు సైతం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నా రాయణ రెడ్డి లతో పాటు రాష్ట్రస్థాయిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రం గారెడ్డి ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. వీరూ యువతను, గిరిజన ఓ టు బ్యాంకును పార్టీ వైపు తిప్పడంలో వీరు సఫలీకృతులయ్యారు.

సామాజిక సమతుల్యత -సీనియారిటీకే ప్రాధాన్యం?

నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు దశాబ్దాలుగా పార్టీకి వెన్నెముకగా నిలిచారు. పీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ వంటి సీనియర్లు మూడు దశాబ్దాలుగా పార్టీ క్రమశి క్షణ తప్పకుండా పనిచేస్తున్నారు. మరోవైపు, సీఎం కుటుంబానికి సన్నిహితులైన మాజీ ఎంపీపీ సూదిని రాంరెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

నామినేటెడ్ పై మున్సిపల్ ప్రభావం?

ఆమనగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఘోర పరాజయం స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మొత్తం 15 స్థానాలకు గానూ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడంపై ఎమ్మెల్యే తీ వ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ము న్సిపల్ ఓటమి తో నామినేటెడ్ పదవులపై కొంత సందిగ్ధత ఏర్పడింది. ఈ వైఫల్యం ప్రస్తుతం నామినేటెడ్ పదవుల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్టీ కోసం ని జాయితీగా పనిచేసిన వారెవరో, వెన్నుపోటు పొడిచిన వారెవరో తేల్చుకోలేని సందిగ్ధంలో ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం.

మరో వైపు, పదవుల కోసం ఆశావహులు తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తు న్నారు. తమకు అనుకూలమైన పెద్ద నేతలతో ఎమ్మెల్యేకు ఫోన్లు చేయిస్తూ, పదవుల కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తె లుస్తోంది. దీంతో ‘పని చేసిన వారికే ప్రాధాన్యమా? లేక ఒత్తిళ్లకు లొంగక తప్పదా?‘ అనే చర్చ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది.

 కార్యకర్తల ఆశలు......

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన నాయకుల జాబితాను రాష్ట్ర పీసీసీకి పంపినట్లు సమాచారం.పార్టీ కష్టకాలంలో ఉన్న ప్పుడు జెండా మోసిన వారికి, గ్రామ, గ్రా మాన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి ఈసారి తప్పకుండా న్యాయం జరుగుతుంద అని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు.

కేవలం పదవుల కోసమే కాకుండా, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి గౌరవిస్తే.. అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే అధిష్టానం ప్రకటించే నామినేటెడ్ పదవుల జాబితా వరకు వేచి చూడాల్సిందే.