3 March, 2026 | 3:58 AM

దవాఖాన సిద్ధం.. అందని వైద్యం!

03-03-2026 12:19 AM

ముహూర్తాల పేర వాయిదాల పర్వం

రూ.కోట్లు ఖర్చు చేసినా వినియోగం శూన్యం

గట్లమల్యాల పీహెచ్సీకి మోక్షమెప్పుడో ?

నంగునూరు,మార్చి 2: భవనం ముస్తాబైంది.. రంగులు అద్దారు.. ఆధునిక మౌలిక వసతులూ సమకూరాయి. కానీ, సామాన్యులకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ చిత్త శుద్ధి మాత్రం కనిపించడం లేదు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ. రెండు కోట్లతో నిర్మించిన ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఇప్పుడు ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఇదిగో అదిగో అంటూ నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు.

మూడు ముహూర్తాలు.. అన్నీ వాయిదాలే!

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ భవన ప్రారంభోత్సవాలే నిదర్శనం. గతంలో మూడుసార్లు ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారయ్యాయి. సాయంత్రం అధికారిక ప్రకటన రావడం, సి బ్బంది సామాగ్రిని కొత్త పీహెచ్సీ కి తరలించడం.. తీరా తెల్లారేసరికి వాయిదా పడటం పరిపాటిగా మారింది. వాయిదా పడగానే మళ్ళీ సామాగ్రిని పాత సబ్ సెంటర్కు తరలించడం స్థానికులను విస్మయానికి గురిచే స్తోంది. పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్లు, గేటు, నీటి సౌకర్యం వంటి పనులన్నీ నెల క్రితమే పూర్తయ్యాయి. కోట్లు ఖర్చు చేసి ని ర్మించిన భవనం పాడుబడుతుంటే,అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరి స్తున్నారు.రాజకీయ నాయకుల ముహూర్తా ల కోసం వేచి చూస్తూ సామాన్యుల ఆరోగ్యా న్ని పణంగా పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సబ్ సెంటర్లో నరకం.. పొలాల మధ్యే వైద్యం

కొత్త భవనం సిద్ధంగా ఉన్నా,ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్న పాత సబ్ సెంటర్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఊరికి దూ రంగా, పంట పొలాల మధ్య ఉన్న ఈ కేం ద్రానికి వెళ్లాలంటే రోగులు,గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సరైన భద్రత లేక, కనీస సౌకర్యాలు లేని చోట వైద్యం అం దక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త పీహెచ్సీ అందుబాటులోకి వస్తే గట్లమల్యాల సహా పది గ్రామాల ప్రజలకు వైద్యం చేరువవుతుంది.

కలెక్టర్ గారూ.. ఇటు చూడండి

గట్లమల్యాల పీహెచ్సీ నూతన భవనంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని వారు స్థానికులు కోరుకుంటున్నారు.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనం పై ప్రభుత్వం తన మెండివైఖరిని వీడి, పది గ్రామాల ప్రజల ప్ర యోజనం దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన వై ద్య సేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.