17 March, 2026 | 9:39 PM

భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, నేల సహజ వనరులను అందించాలి

17-03-2026 08:10 PM

మంథని డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ

మంథని,(విజయక్రాంతి):  భావితరాలకు విద్యార్థులు స్వచ్ఛమైన గాలి, నీరు, నేల సహజ వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంథని డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యాశాఖ,  గ్రీన్ రెవల్యూషన్ కౌన్సిల్ సూచన  మేరకు పర్యావరణ పరిరక్షణ అవగాహనలో భాగంగా కళాశాలలో ఉన్న వేప వృక్షాన్ని "మాతృ వృక్షం" (మదర్ ట్రీ)గా ప్రకటించారు.

ఈ సందర్భంగా  పర్యావరణ అనుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా ప్రతి జీవి అస్థిత్వానికి కారణమైన పుడమితల్లి సంరక్షణ ను ఒక బాధ్యతగా భావిస్తూ, పుడమితల్లిని సంరక్షిస్తామని, భావితరాలకు సురక్షితమైన, సుస్థిర మైన, ఆరోగ్యకరమైన, కాలుష్య రహిత సహజ వనరులు, పర్యావరణముతో కూడిన భవిష్యత్తు' అందించేందుకు  కృషి చేస్తామని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ  ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. జై కిషన్ ఓజా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... పర్యావరణాన్ని సంరక్షించే చర్యలను ప్రతి ఒక్కరూ  కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ సభ్యులు, ఐక్యుఏసీ కోఆర్డినేటర్ కృష్ణ, కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిషయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్, ముకుంద, ఫర్జానా, మానస, రజిత, దుర్గం కృష్ణ, శేఖర్, శ్రీధర్ విద్యార్థినీ, విద్యార్థులు  పాల్గొన్నారు.