30 June, 2026 | 8:40 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

సూర్య గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

17-03-2026 08:17 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రికొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.వేణుగోపాల్ మంగళవారం సుజాతనగర్‌లోని ఎంఎస్ సూర్య గ్యాస్ ఏజెన్సీ గోదాం కార్యాలయంను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్, పంపిణీ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం ఆయన మాట్లాడుతూ... వినియోగదారులకు ఎల్పీజీ రీఫిల్ సిలిండర్లను సీనియారిటీ క్రమంలోనే పారదర్శకంగా అందజేయాలని స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. ఈ తనిఖీలో సంబంధిత విభాగాల అధికారులు, ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.