17 March, 2026 | 9:39 PM

భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పర్యటన

17-03-2026 08:04 PM

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈనెల 18 నుండి 20 వరకు మూడు రోజులపాటు భద్రాచలంలో పర్యటిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారని అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియమును సందర్శించి ఐటీసీలో రాత్రి బస చేసి 19నాడు ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానములో ప్రత్యేక పూజలు నిర్వహించి పాపికొండల సందర్శనకు బయలుదేరి వెళ్లి పాపికొండల సందర్శన అనంతరం తిరిగి రాత్రి ఐటిసిలో బస చేసి 20వ తారీకు నాడు ఉదయం హైదరాబాదుకు బయలుదేరి వెళ్తారని ఆయన అన్నారు.