30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చేవెళ్లలో నర్సింగ్ హోమ్ సీజ్

31-05-2025 12:32 AM

-చేవెళ్ల, మే 30: చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని ‘ప్రజా వైద్య శాల నర్సింగ్ హోమ్’ ను అధికారులు సీజ్ చేశారు.  బొడ్డు సమస్య కారణంగా ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న కేసారం వార్డుకు చెందిన కళ్లెంల నరసింహులు(50) డాక్టర్ నిర్లక్ష్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. 

దీనిపై స్పందించిన డీఎంహెచ్ వో వెంకటేశ్వర్లు వెంటనే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని  జిల్లా ఆరోగ్య శాఖ బృందం, చేవెళ్ల డివిజన్ అధికారులను ఆదేశించారు. దీంతో వారు శుక్రవారం ఆస్పత్రికి  వెళ్లగా తాళం వేసి ఉంది.  యాజమాన్యానికి ఫోన్ చేసినా స్పందించలేదు.  విషయం డీఎంహెచ్ వోకు చెప్పగా.. ఆయన సూచనల మేరకు ఆస్పత్రిని సీజ్ చేశారు.